నిజంనిప్పులాంటిది

May 05 2023, 16:02

కేటీఆర్ పర్యటనలో బిఆర్ఎస్ నేతల అసమ్మతి రాగం

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని కొంత‌మంది బీఆర్ఎస్ నేత‌లు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. ఒక‌ప్పుడు పార్టీలో కీల‌ కంగా ప‌నిచేసిన త‌మ‌కు క‌నీస గుర్తింపు ద‌క్కడం లేద‌ని ఆవేద‌న‌కు లోన‌వుతున్నారు.

ఇందులో ఉద్యమ కాలం నాటి డివిజ‌న్ స్థాయి నేత‌ల‌తో పాటు, మాజీ కార్పొరేట‌ర్లు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆ మాట‌కొస్తే నియోజ‌క‌వ‌ర్గస్థాయి నేత‌ల‌ను కూడా విస్మరించార‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. ప‌శ్చిమ ఎమ్మెల్యే విన‌య్‌భాస్కర్ కొంత‌మందికే నాయ‌కుడిగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని కూడా ఆగ్రహాలు వ్యక్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఉద్యమ నేత‌ల్లో నైరాశ్యం..!

ఉద్యమ‌కాలం నుంచి పార్టీలో ప‌నిచేస్తున్న త‌మ‌కు ప్రస్తుతం పార్టీలో గుర్తింపు క‌రువైంద‌ని వాపోతున్నారు. వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ జిల్లాల్లో ప‌లు అభివృద్ధి ప‌నులకు శంకుస్థాప‌న‌, ప్రారంభోత్సవాల‌ను నిర్వహించేందుకు శుక్రవారం మ‌ధ్యాహ్నం న‌గ‌రానికి మంత్రి కేటీఆర్ రానున్న నేప‌థ్యంలో బీఆర్ఎస్‌లో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి.

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యేతో విబేధాలున్న నేత‌ల‌కు ఆహ్వానం అంద‌లేద‌న్న చ‌ర్చ పార్టీ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతోంది. హ‌న్మకొండ జిల్లా పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన పూజా తంతు కార్యక్రమానికి, ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సిందిగా నేత‌ల‌కు మాట‌మాత్రంగానైనా ఎమ్మెల్యే కార్యాల‌యం నుంచి వెళ్లలేద‌ని స‌మాచారం.

కాజీపేట‌లో పార్టీ కార్యక‌ర్తల స‌మావేశం కూడా నిర్వహిస్తున్న నేప‌థ్యంలో కీల‌కంగా ప‌నిచేసిన త‌మ‌కు ఆహ్వానం లేదు.. బాధ్యత‌ల్లేవ‌న్న బాధ‌ను వ్యక్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇక శుక్రవారం ఉద‌యం పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన పూజాతంతులో ఎమ్మెల్యేకు స‌న్నిహితంగా ఉండే కొద్దిమంది నేత‌లే హాజ‌ర‌వ‌డాన్ని గుర్తు చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

May 05 2023, 12:41

8 న ఇంటర్ ఫలితాలు? ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈనెల 8న ఇంటర్‌ ఫలితాలను ప్రకటించేందుకు ఇంటర్‌ బోర్డు అధికారులు కసరత్తు చేపడుతున్నారు. 10వ తేదీలోపు ఇంటర్‌ ఫలితాలను ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఈక్రమంలోనే శని, ఆది, సోమవారాల్లో ఏదేని ఒక రోజు ఫలితాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముందస్తు బిజీ షెడ్యూల్‌ కారణంగా శని, ఆదివారాల్లో ఫలితాలను ప్రకటించే అవకాశంలేదని తెలుస్తోంది.

ఈ క్రమంలో సోమవారం అంటే ఈనెల 8న ఇంటర్‌ ఫలితాలను ప్రకటించాలని అనుకుంటున్నట్లుసమాచారం. ఫలితాల్లో ఎలాంటి తప్పులు, సమస్యలకు తావివ్వకుండా ఈసారి ఇంటర్‌ ఫలితాలను పకడ్బందీగా వెల్లడించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది.

ఈక్రమంలోనే ఫలితాల వెల్లడిలో కాస్త సమయం తీసుకుంటుంది. ఒకటికి రెండు సార్లు మార్కుల నమోదు, క్రాస్‌ చెక్‌ చేసుకున్న తర్వాత ఫలితాలకు సిద్ధమవుతున్నారు. ఇంటర్‌ ఫస్ట్‌, సెంకడియర్‌ కలిపి మొత్తం 9.47లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలకు హాజరయ్యారు. వీరంతా ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 05 2023, 12:38

హుస్నాబాద్‌ చేరుకున్న మంత్రి కేటీఆర్‌.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో పర్యటిస్తున్నారు. హుస్నాబాద్‌ పట్టణంలో పలు అభివృద్ధి నులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే సతీశ్‌ పాల్గొన్నారు.

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో పర్యటిస్తున్నారు. హుస్నాబాద్‌ పట్టణంలో ఇండోర్‌ స్టేడియం, డిగ్రీ కాలేజీ, ఎస్టీ బాలికల హాస్టల్‌ ప్రారంభించారు. లబ్దిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే సతీశ్‌ పాల్గొన్నారు. ఉదయం 11.35 గంటలకు డిపో గ్రౌండ్‌లో భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజ నం, 2.30 గంటలకు హుస్నాబాద్‌ నుంచి హనుమకొండ పర్యటనకు వెళ్తారు.

హనుమకొండలో రూ.181 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.5.20 కోట్లతో నిర్మించిన మాడల్‌ వైకుంఠధామం, సైన్స్‌ పార్‌లను ప్రారంభిస్తారు. తెలంగాణ స్టేట్‌ సైన్స్‌ టెక్నాలజీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో రూ.8.50 కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ సెల్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. రూ.128 కోట్లతో 17 పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు హసన్‌పర్తి కిట్స్‌ కాలేజీలో ఇన్నోవేషన్‌ హబ్‌ను, సాయంత్రం 4.30 గంటలకు హనుమకొండలో బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 6.30 గంటలకు కాజీపేటలోని సెయింట్‌ గ్యాబ్రియల్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు.

నిజంనిప్పులాంటిది

May 05 2023, 12:34

మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా : డిజిపి అంజనీ కుమార్

తెలంగాణ లో మావోయిస్టుల కదిలికలపై నిఘా పెంచాలని, క్షేత్రస్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ఇటీవల మావోయిస్టుల దాడిలో 10 భద్రతా సిబ్బంది మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రం లో నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల పోలీస్‌ అధికారులతో డీజీపీ ఆన్‌లైన్‌ వర్క్‌షాప్‌ నిర్వహించారు.

గ్రేహౌండ్స్‌ అడిషనల్‌ డీజీ విజయ్‌కుమార్‌, అడిషనల్‌ డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌, ఎస్‌ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు, ఐజీలు చంద్రశేఖర్‌రెడ్డి, షానవాజ్‌ ఖాసీంతోపాటు ఇతర అధికారులతో కలిసి డీజీపీ కీలక విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ ప్రముఖు లు, వీవీఐపీల పర్యటనల నేపథ్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు తీసుకోవాలని డీజీపీ సూ చించారు.

రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల యాక్షన్‌ టీంల కదలికలు పెరిగే అవకాశం ఉన్నదని, ఆ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పోలీసుల నిరంతర కృషితో తెలంగాణలో మావోయిస్టులు అంతరించిపోయారని తెలిపారు.

రాష్ట్రంలో 80% కొత్తగా విధుల్లో చేరిన పోలీసులు ఉండటం వల్ల మావోయిస్టుల వ్యూహా లు, చర్యలు, దాడులపై మరింత అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. పోలీసు ద ళాల కదలికల్లో మార్పులు, వ్యూహాల్ని ఎప్పటికప్పుడు మారుస్తుండాలని ఆపరేషన్స్‌ అదనపు డీజీపీ విజయ్‌కుమార్‌ సూచించారు. తీవ్రవాద పరిస్థితులు, తీసుకొనే భద్రతా చర్యలను ఐజీ ప్రభాకర్‌రావు వివరించారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 05 2023, 09:50

తిరుమలలో తగ్గని భక్తులు

తిరుమల లో భక్తులరద్దీ ఎక్కువగానే ఉంది. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీవారి సర్వదర్శనానికి 13 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

నిన్న గురువారం శ్రీవారిని 64,707 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.98 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 28,676 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 05 2023, 09:47

వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు రైతుల ఖాతాలో జమ

తెలంగాణలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. . ఈనెల 12 నుంచి రైతులకు నగదు పంపిణీ చేయనునుంది.

గత నెల 23న సీఎం కేసీఆర్ స్వయంగా వరంగల్ జిల్లాలో పర్యటించారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. ఈ క్రమంలో ఎకరానికి రూ.10వేల చొప్పున పంట పరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఈ నెల 12 నుంచి రైతులకు పంట నష్టపరిహారానికి సంబంధించిన చెక్కులను అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అయితే సీఎం కేసీఆర్ పరిహారం ప్రకటించినా ఇంతవరకు అవి రైతుల చెంతకు రాలేవని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే సమయంలో వర్షాలు కూడా ఆగడం లేదు.

దీంతో వర్షాల వల్ల నష్టపోయిన బాధిత రైతులందరికీ నగదు పంపిణీ చేస్తామన్నారు. కౌలు రైతులకు కూడా పరిహారం చెల్లిస్తామన్నారు. అలాగే నష్టపోయిన కౌలు రైతుల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అందించారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 05 2023, 09:45

మొక్క జొన్న కు రెక్కలు

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు, మొక్క జొన్నలకు మద్దతు ధర రాని పరిస్థితులో ప్రభుత్వమే మక్కల కొనుగోలుకు కేంద్రాలను సిద్ధం చేస్తుండడంతో రైతుకు ఊరట కలుగుతోంది. ఇప్పటికే జిల్లా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రా రంభానికి సిద్ధమయ్యాయి.

మొక్కజొన్నలు ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కు వ ధర పలుకుతుండడంతో మక్కల రైతులు ఆందోళనతో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధరతో ఖరీదులు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

దీంతో కొనుగోలు కేంద్రాల ప్రారంభమయ్యాయి ముందుగా బయ్యారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి త ర్వాత జిల్లాలోని ఇతర కేంద్రాల్లో ప్రారంభించడానికి జిల్లా మార్క్‌ఫెడ్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 37 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నాటి వరకు రైతుల వద్దనున్న మొక్కజొన్నలను ఖరీదు చేపడుతారు.

కొనుగోళ్లు ఇలా..

కేసముద్రం, మహబూబాబాద్‌ వ్యవసాయ మా ర్కెట్లలో గత మార్చి నెల నుంచి మక్కల ధరలు త గ్గుముఖం పట్టాయి. మక్కలు గత మార్చి నెలలో రూ.2078 నుంచి రూ.2100 వరకు ఉండగా ఏప్రిల్‌ నెలలో రూ.1749 నుంచి రూ.1849 వరకు ధరలు ప లికాయి. అత్యధికంగా రూ.1700తోనే అధికంగా మక్క లు కొనుగోలు చేశారు. దీంతో రైతులు ప్రభుత్వ మద్ద తు ధర రాక రైతులు నష్టపోయారు. ఇదే మార్కెట్‌ లో కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. దీంతో కేసీఆర్‌ స్పం దించి మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగానే జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు.

వ్యవసాయ పోర్టల్‌లో నమోదై ఉంటేనే..

రైతు సమగ్ర సమాచార పోర్టల్‌లో మొక్కజొన్నలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు నమోదు చేసుకుంటేనే రైతులకు మక్కల కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే వీలును ప్రభుత్వం కల్పించింది. దీని ద్వారా దళారులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతులు తమ వెంట పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డుతో వ్యవసాయ విస్తీర్ణ అధికారి వద్దకు వెళ్లి టోకెన్‌ తీసుకున్న తర్వాతనే మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రాలకు తరలించాలి. ప్రభుత్వ నిబంధన ప్రకారం మక్కలకు తేమశాతంతో పాటు నాణ్యతగా ఉండేందుకు పూర్తిగా ఎండబెట్టి ఉంటేనే నిర్వాహకులు మక్కలను కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తా రు. ఆ తర్వాత నేరుగా రైతులకు రైతుబంధు ఖాతాల్లో ఆ ఆకౌంట్లలోనే ప్రభుత్వం నగదు జమ చేస్తుంది.

నిజంనిప్పులాంటిది

May 05 2023, 09:42

పొంగులేటి బీజేపీ కి పనికి వస్తాడా ❓️

ఖమ్మం: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతాపార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది.

భారాస వ్యతిరేక శక్తులను తమవైపు తిప్పుకొనేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భారాస బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కమలం గూటికి రప్పించేందుకు ముమ్మరంగా యత్నిస్తోంది.

ఈమేరకు భాజపా చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో ముఖ్యనేతల బృందం గురువారం ఖమ్మానికి వచ్చి పొంగులేటితో భేటీ కానుంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటితో గురువారం భేటీ కానున్నారు.

వాస్తవానికి భారాస నుంచి బహిష్కరణకు గురైన తర్వాత భాజపాలోకి రావాలని ఈటల రాజేందర్‌ పలుమార్లు పొంగులేటిని ఆహ్వానించినట్లు గతంలోనే ప్రచారం సాగింది. రెండు జాతీయ పార్టీల ముఖ్యనేతలు తనను సంప్రదిస్తున్నారంటూ మాజీ ఎంపీ పలుమార్లు వ్యాఖ్యానించారు.

భారాసను మూడోసారి అధికారంలోకి రానివ్వకుండా.. కేసీఆర్‌ను సీఎం కాకుండా చేసే పార్టీలోకే వెళతానని ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు సంబంధించి భారాస అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని శపథం చేశారు. మరికొద్దిరోజుల్లోనే ఖమ్మం నగరంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనానికి సన్నద్ధమవుతున్నారు. ఈలోగా భాజపా ముఖ్యనేతలు పొంగులేటితో భేటీ అవుతున్నారు.

నిజంనిప్పులాంటిది

May 04 2023, 19:32

తెలంగాణ హోంమంత్రి మహమూద్అలీ కి ఢిల్లీ పోలీస్ షాక్

హైదరాబాద్: ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు. అనుకున్న ముహూర్తానికే అంటే సరిగ్గా మధ్యాహ్నం 1:05 గంటలకు కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హోంమంత్రి మహమూద్‌‌ అలీ కి కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పార్టీ ఆదేశాల ప్రకారం ఢిల్లీ వెళ్లారు. హైదరాబాద్ నుంచి విమానంలో ఢిల్లీ వెళ్లిన హోంమత్రి ఎయిర్ పోర్టు నుంచి కారులో పార్టీ ఆఫీసుకు బయలుదేరారు.

అయితే మహమూద్‌ అలీకి ఢిల్లీ పోలీసులు షాకిచ్చారు. అంతేకాదు ఆయన కారును అడ్డుకుని నడుచుకుంటూ వెళ్లాలని చెప్పారు. పాపం ఢిల్లీ పోలీసులకు మహమూద్‌ అలీ.. తెలంగాణ రాష్ట్రానికి హోం మంత్రి అనే విషయం తెలియదు. సాదారణ పౌరుడు అనుకుని ఆయనపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఇదంతా అవగాహనలేక పోవడం వల్ల జరిగిన పొరపాటు. ఇంతలోనే తాను హోంమంత్రిని అని చెప్పడంతో పోలీసులు కంగుతున్నారు. పొరపాటును సరిదిద్దుకుని ఆయనను అనుమతించారు.

ఇలాంటి అవమానాలు మహమూద్‌ అలీకి ఢిల్లీలోనే కాదు... స్వంత రాష్ట్రం, అది కూడా ప్రగతిభవన్‌లో గతంలో ఎదురైంది. ఆ సమయంలో కరోనా తీవ్రంగా ఉంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశానికి అతికొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలు పంపారు. మహమూద్‌ అలీ కూడా ఈ సమావేశంలో పాల్గొనేందుకు నేరుగా ప్రగతిభవన్ వెళ్లారు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ఢిల్లీలో చెప్పినట్లే తాను హోంమంత్రినని మహమూద్ అలీ చెప్పారు. అయినా పోలీసులు ఆయనను అనుమతించలేదు. ఇక ఏమీ చేయలేక సమావేశంలో పాల్గొనకుండా ఆయన వెనుతిరిగారు.

నిజంనిప్పులాంటిది

May 04 2023, 14:39

ఢిల్లీ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

11 వేల చదరపు అడుగుల స్థలంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. జీ ప్లస్ త్రీ విధానంలో భవన నిర్మాణం జరిగింది. లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, మొదటి, రెండు, మూడు అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులతో భవనాన్ని నిర్మించారు.

మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుడి చాంబర్, పేషీ, కాన్ఫరెన్స్ హాల్‌ను ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్, క్యాంటీన్‌ను నిర్మించారు.

2, 3 అంతస్తుల్లో ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందుకు 18 గదులతో పాటు రెండు ప్రత్యేక సూట్ రూమ్‌లు నిర్మించారు. సూట్ రూమ్‌లో పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బస చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి.

మీడియాకు నో ఎంట్రీ...

కాగా.. ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియాకు బీఆర్ఎస్ కార్యాలయంలోకి అనుమతి లభించలేదు. అధికారుల ఆదేశాల మేరకు మీడియాను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు నుంచి పోలీసులు బయటకు పంపించివేశారు.

పార్టీ ఆఫీస్ ప్రాంగణంలో కూడా మీడియా వాళ్ళు ఎవరు ఉండవద్దంటూ హుకుం జారీ చేశారు. పైనుంచి ఆదేశాలు వచ్చాయని... అందుకోసమే మీడియాకు నో ఎంట్రీ అని ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది చెబుతోంది. ఈ ఆంక్షలపై మీడియా ప్రతినిధులు మండిపడుతున్నారు.